తీరం దాటిన వాయుగుండం

ABN , First Publish Date - 2022-08-15T08:51:03+05:30 IST

తీరం దాటిన వాయుగుండం

తీరం దాటిన వాయుగుండం

విశాఖపట్నం, శ్రీకాకుళం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఉత్తర ఒడిసా, పశ్చిమబెంగాల్‌ మధ్య ఆదివారం తీరం దాటింది. ఉత్తరకోస్తాలో ఎక్కువచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమలో చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరకోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది. 

Read more