నేను నోరు విప్పితే ఒడిసా షేక్‌!

ABN , First Publish Date - 2022-12-07T03:04:35+05:30 IST

ప్రముఖులను ముగ్గులోకి దించి (హనీ ట్రాప్‌) వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు దిగిన ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన కేసులో అరెస్టయిన అర్చనా నాగ్‌..

నేను నోరు విప్పితే ఒడిసా షేక్‌!

హనీట్రాప్‌ కేసులో అరెస్టయిన అర్చనా నాగ్‌

భువనేశ్వర్‌, డిసెంబరు 6: ప్రముఖులను ముగ్గులోకి దించి (హనీ ట్రాప్‌) వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు దిగిన ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన కేసులో అరెస్టయిన అర్చనా నాగ్‌.. తాను నోరు విప్పితే ఒడిసా రాష్ట్రమే షేక్‌ అవుతుందని హెచ్చరించింది. ఒడిసాకు చెందిన అర్చన ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉంది. విచారణకు ముందు వైద్య పరీక్షల నిమిత్తం అధికారులు మంగళవారం ఆమెను భువనేశ్వర్‌లోని క్యాపిటల్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన వద్ద రాష్ట్రాన్ని షేక్‌ చేసే ఎక్స్‌క్లూజివ్‌ సాక్ష్యాలున్నాయని చెప్పింది. ‘నేను నోరు విప్పితే రాష్ట్రంలో పరిస్థితి మొత్తం మారిపోతుంది. ఎవరినీ వదిలిపెట్టను’’ అని తెలిపింది. శ్రద్ధాంజలి కాల్‌ రికార్డ్‌ను పరిశీలించాలని కోరింది.

Updated Date - 2022-12-07T03:04:36+05:30 IST