ఎన్టీఆర్‌ ఓ యూనివర్సిటీ

ABN , First Publish Date - 2022-08-01T09:32:03+05:30 IST

తెలుగువారికి దేశంలోనూ, ప్రపంచంలోనూ గుర్తింపు తెచ్చిన తొలి వ్యక్తి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) అని సీనియర్‌ నటి జయసుధ అన్నారు. ఎన్టీఆర్‌ను చూసి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని, ఆయన ఓ యూనివర్సిటీ

ఎన్టీఆర్‌ ఓ యూనివర్సిటీ

ఆయనతో నటించడం అదృష్టం: జయసుధ

ఎన్టీఆర్‌ శతాబ్ది పురస్కారం అందుకున్న సహజనటి


తెనాలి, జూలై 31: తెలుగువారికి దేశంలోనూ, ప్రపంచంలోనూ గుర్తింపు తెచ్చిన తొలి వ్యక్తి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) అని సీనియర్‌ నటి జయసుధ అన్నారు. ఎన్టీఆర్‌ను చూసి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని, ఆయన ఓ యూనివర్సిటీ అని అభివర్ణించారు. గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్‌ శతాబ్ది ఉత్సవాల్లో ఆదివారం రాత్రి జయసుధకు ఎన్టీఆర్‌ శతాబ్ది పురస్కారం ప్రదానం చేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్‌తో నటించడం నటీనటులకు అదృష్టమని, ఎంత గొప్ప స్థాయికి చేరినా ప్రతి ఒక్కరినీ గారు అని సంబోధించడం ఆయన విజ్ఞతకు నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి, సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి మోహనకృష్ణ, నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. 

Read more