ఇప్పుడు అటువంటి ఆలోచన లేదు: అనిల్

ABN , First Publish Date - 2022-03-07T22:20:44+05:30 IST

రాష్ట్రంలో కొత్త పార్టీ పెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బ్రదర్ అనిల్

ఇప్పుడు అటువంటి ఆలోచన లేదు: అనిల్

విజయవాడ: రాష్ట్రంలో కొత్త పార్టీ పెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బ్రదర్ అనిల్ ఖండించారు. ఇప్పుడు అటువంటి ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అంశం మొత్తం ఊహాగానాలేనని ఆయన అన్నారు. ఏమైనా ఉంటే.. తాను మీడియా ముందుకు వచ్చి వివరాలను వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. 


రాష్ట్రంలోని వివిధ సంఘాలతో వైఎస్సాఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల భర్త బ్రదర్ అనిల్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం దాదాపు  రెండు గంటలపాటు సాగింది. త్వరలో కొత్త  పార్టీ ప్రకటించే ఆలోచనలో బ్రదర్‌ అనిల్ ఉన్నాడని  ఆ వర్గాలు పేర్కొన్నాయి. జగన్, వైసీపీ వ్యతిరేక వర్గాలతో బ్రదర్‌ అనిల్ మంతనాలు జరిపారు. 

Updated Date - 2022-03-07T22:20:44+05:30 IST