బీఆర్క్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2022-09-08T09:09:35+05:30 IST

బీఆర్క్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

బీఆర్క్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

కడప (వైవీయూ), సెప్టెంబరు 7: రాష్ట్రవ్యాప్తంగా బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌) కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఈసీ సురేంద్రనాథరెడ్డి వెల్లడించారు. 2022-23 విద్యా సంవత్సరానికి బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్టు వివరించారు. కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ నిర్వహించే ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (నాటా) 2022 లేదా జేఈఈ మెయిన్స్‌ పేపర్‌-2 (బీఆర్క్‌) 2022లో అర్హత సాధించిన వారు ఇంటర్‌, టెన్త్‌+2 లేదా టెన్త్‌+3 (మేతమేటిక్స్‌ డిప్లమా) పూర్తి చేసిన వారు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ నెల 12వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Read more