ఆప్కాబ్‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ABN , First Publish Date - 2022-11-03T05:19:11+05:30 IST
రాష్ట్రంలో కోఆపరేటీవ్ క్రెడిట్ స్ట్రక్చర్‌కు బ్రాండ్ మేనేజర్, అడ్మినిస్ర్టేటర్ కమ్ కన్సల్టెంట్ పోస్టులకు ఆప్కాబ్ నోటీఫికేషన్ జారీ చేసింది.
అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కోఆపరేటీవ్ క్రెడిట్ స్ట్రక్చర్‌కు బ్రాండ్ మేనేజర్, అడ్మినిస్ర్టేటర్ కమ్ కన్సల్టెంట్ పోస్టులకు ఆప్కాబ్ నోటీఫికేషన్ జారీ చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఏడాది పాటు పని చేయడానికి అర్హులైన అభ్యర్ధులు ఈ నెల 7వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొంది. సీఏఐఐబీ విద్యార్హతతో 40-70 ఏళ్ల మధ్య వయస్సు కల వారు ఈ పోస్టులకు అర్హులని తెలిపింది. కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్ కింద నెలకు రూ.75వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వివరాలను ఆప్కాబ్ వెబ్‌సైట్‌లో పెట్టిన నోటిఫికేషన్‌లో చూడవచ్చని తెలిపింది.