అమరావతి కాదు కమ్మరావతి: అప్పలరాజు

ABN , First Publish Date - 2022-03-05T22:10:10+05:30 IST

అమరావతి కాదు కమ్మరావతి అని మంత్రి అప్పలరాజు దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 రాజధానులకు చంద్రబాబు మోకాళ్ళడ్డుతున్నారని

అమరావతి కాదు కమ్మరావతి: అప్పలరాజు

శ్రీకాకుళం: అమరావతి కాదు కమ్మరావతి అని మంత్రి అప్పలరాజు దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 రాజధానులకు చంద్రబాబు మోకాళ్ళడ్డుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతివిషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు కోర్టుకెళ్లి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఆర్‌డీఏ రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. కానీ తమ విధానం వికేంద్రీకరణ అని చెప్పారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా 3 రాజధానులపై సీఎం జగన్ ముందుకెళ్తున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రకు రాజధాని రాకుండా.. అడ్డుపడుతున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని అప్పలరాజు పిలుపునిచ్చారు.

Read more