ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్‌

ABN , First Publish Date - 2022-02-14T21:07:44+05:30 IST

ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ షాకిచ్చింది. చిత్తూరు జిల్లాలో చేపట్టిన మూడు రిజర్వాయర్ల పనులను నిలిపివేయాలని ఎన్జీటీ

ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్‌

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ షాకిచ్చింది. చిత్తూరు జిల్లాలో చేపట్టిన మూడు రిజర్వాయర్ల పనులను నిలిపివేయాలని ఎన్జీటీ, ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అవులపల్లితో పాటు ఏపీలో చేపట్టిన మూడు రిజర్వాయర్లకు ఎన్జీటీ బ్రేక్ వేసింది. పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని ఎన్జీటీ స్పష్టం చేసింది. పర్యావరణాన్ని అంచనా వేయకుండా రిజర్వాయర్లను ఎలా చేపట్టారని ఎన్జీటీ ప్రశ్నించింది. తాగునీరు ఎంత అవసరమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే అవసరమని అభిప్రాయపడింది. పర్యావరణం నష్టం వాటిల్లదన్న ఏపీ ప్రభుత్వ వాదనలను ఎన్జీటి త్రోసిపుచ్చింది. పర్యావరణ అనుమతులు పొందిన తరువాతే ప్రాజెక్టులను ప్రారంభించాలని ఎన్జీటి ఆదేశించింది. గాలేరు‌-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులో భాగంగా మూడు రిజర్వాయర్ల నిర్మాణాన్ని ప్రభుత్వం అదనంగా చేపట్టింది. గతంలో ఇషి అనుమతులు పొందిన ప్రాజెక్టుల విస్తరణలో భాగంగానే రిజర్వాయర్లను నిర్మిస్తున్నామని, కొత్త రిజర్వాయర్ల నిర్మాణం వల్ల పర్యావరణ ముప్పు ఉండదని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2022-02-14T21:07:44+05:30 IST