అమంగళం ప్రతిహతమౌగాక!
ABN , First Publish Date - 2022-01-12T08:27:50+05:30 IST
అభిమానం పలురకాలు! సినిమా అభిమానులు కటౌట్లు పెట్టి దండలు వేస్తారు! కొత్తగా రాజకీయ నాయకులు తమ ఫొటోలకు పాలాభిషేకాలు చేయించుకుంటున్నారు!
అభిమానం పలురకాలు! సినిమా అభిమానులు కటౌట్లు పెట్టి దండలు వేస్తారు! కొత్తగా రాజకీయ నాయకులు తమ ఫొటోలకు పాలాభిషేకాలు చేయించుకుంటున్నారు! ఇక్కడ... జరుగుతున్నది వేరు. ముఖ్యమంత్రి జగన్పై అభిమానం ఆయన ఫొటోకు దండేసే వరకూ వెళ్లింది. మన సంప్రదాయంలో ఫొటోలకు దండలు ఎప్పుడు వేస్తారో తెలియంది కాదు. ఎంతటి అభిమానం పొంగి పొర్లినా ఇప్పటి వరకూ జీవించి ఉన్న నేతల ఫొటోలకు దండలేసిన సీన్లు చూడలేదు. తాజాగా, కృష్ణా జిల్లా నూజివీడు మునిసిపల్ ఆఫీసులో కొందరు ముఖ్యమంత్రి జగన్ ఫొటోకు దండేసి... పూలు జల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో చూసిన జనం విస్తుపోతున్నారు.