కొత్తగా 59 కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-03-16T08:41:16+05:30 IST

రాష్ట్రంలో 24 గంటల్లో 10,914 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 59 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ బులెటిన్‌ ద్వారా వెల్లడించింది.

కొత్తగా 59 కరోనా కేసులు

అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 24 గంటల్లో 10,914 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా  59 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ బులెటిన్‌ ద్వారా వెల్లడించింది. అనంతపురంలో అత్యధికంగా 24 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకూ 23,18,943 మంది కరోనా బారిపడ్డారు. 23,03,690 మంది కోలుకున్నారు. మంగళవారం మరో 83 మంది కోలుకున్నారు.  ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కలిపి 523 మంది చికిత్స పొందుతుండగా, కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.

Read more