మూడు జిల్లాలకు కొత్త డీఎంహెచ్‌వోలు

ABN , First Publish Date - 2022-07-07T09:25:53+05:30 IST

మూడు జిల్లాలకు కొత్త డీఎంహెచ్‌వోలు

మూడు జిల్లాలకు కొత్త డీఎంహెచ్‌వోలు

అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూడు జిల్లాలకు కొత్త డీఎంహెచ్‌వోలను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా వైద్యాధికారిగా ఆర్‌.రామనారాయణరెడ్డిని నియమించింది. ప్రస్తుతం ఆయన జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమానికి జాయింట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైద్యాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ యు.శ్రీహరిని తిరుపతి జిల్లా డీఎంహెచ్‌వోగా బదిలీ చేశారు. ఒంగోలు జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ ఎస్‌.ఖాన్‌ను గుంటూరు జిల్లా డీఎంహెచ్‌వోగా బదిలీ చేశారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఏడు రోజుల్లో బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  


Read more