నెల్లూరు జిల్లాలో మరోసారి భగ్గుమన్న వైసీపీ గ్రూపు రాజకీయాలు..

ABN , First Publish Date - 2022-08-14T00:11:37+05:30 IST

జిల్లాలో వైసీపీ గ్రూపు రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. ఏఎస్‌పేట మండలం పెద్దఅబ్బీపురంలో..

నెల్లూరు జిల్లాలో మరోసారి భగ్గుమన్న వైసీపీ గ్రూపు రాజకీయాలు..

నెల్లూరు: జిల్లాలో వైసీపీ గ్రూపు రాజకీయాలు (Ycp Group Politics) మరోసారి భగ్గుమన్నాయి. ఏఎస్‌పేట మండలం పెద్దఅబ్బీపురంలో అవినీతి అక్రమాలపై ప్రశ్నించారన్న నేపంతో ఓ వర్గం రెచ్చిపోయింది. ప్రత్యర్థివర్గానికి చెందిన రైతు వెంగయ్య (Former Vengaiah) వ్యవసాయ క్షేత్రంలో వందకు‌పైగా మామిడి చెట్లను నరికి వేశారు. రెండు పంపు సెట్లను ధ్వంసం చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 


కాగా ఏస్‌పేట సచివాలయానికి కొంతమంది అధికారులు వచ్చారు. అయితే అధికారులను ఓ వర్గానికి చెందిన వాళ్లు అడ్డుకున్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని నిలదీశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మరో వర్గం.. రైతు వెంగయ్య వ్యవసాయ క్షేత్రంలోని మామిడి చెట్లను నరికి వేశారు. దీంతో రైతు వెంగయ్య లబోదిబోమంటున్నారు. అవినీతిని ప్రశిస్తే ఈ రకంగా తెగబడతారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. Updated Date - 2022-08-14T00:11:37+05:30 IST