భ్రమరాంబాదేవి అమ్మవారికి వైభవంగా కుంభోత్సవం
ABN , First Publish Date - 2022-04-19T13:41:58+05:30 IST
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా అమ్మవారికి వైభవంగా కుంభోత్సవం నిర్వహించారు.

నంద్యాల: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా అమ్మవారికి అర్చకులు వైభవంగా కుంభోత్సవం నిర్వహించారు. కుంభోత్సవం సందర్భంగా ఆలయంలో అన్ని ఆర్జితసేవలతో పాటు కళ్యాణం, ఏకాంతసేవ తాత్కాలికంగా నిలుపుదల చేశామని ఈవో లవన్న తెలిపారు. అమ్మవారికి సాత్విక బలిగా గుమ్మడికాయలు, కొబ్బరి, నిమ్మకాయలను అధికారులు సమర్పించారు. సాయంత్రం అన్నాభిషేకం అనంతరం ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. తిరిగి రాత్రి 7 నుంచి భక్తులకు అమ్మవారి దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. దేవాదాయ చట్టం అమలులో భాగంగా జంతు పక్షు బలులు శ్రీశైలంలో నిషేధించారు.