నంద్యాలలో ఎర్రచందనం కూలీల అరెస్ట్

ABN , First Publish Date - 2022-04-22T13:33:37+05:30 IST

జిల్లాలోని మహానంది మండలం చలమ అటవీ రేంజ్ పరిధిలో సంచరిస్తున్న 15 మంది ఎర్ర చందనం కూలీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

నంద్యాలలో ఎర్రచందనం కూలీల అరెస్ట్

నంద్యాల: జిల్లాలోని మహానంది మండలం చలమ అటవీ రేంజ్ పరిధిలో సంచరిస్తున్న 15 మంది ఎర్ర చందనం కూలీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి నాలుగు ఎర్ర చందనం దుంగలు, పది గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమిళనాడు రాష్ట్రం తిరునామలైకు చెందిన 14 మంది, తిరుపతికి చెందిన మరో వ్యక్తిగా గుర్తించారు. ప్రధాన స్మగ్లర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

Updated Date - 2022-04-22T13:33:37+05:30 IST