రైతుబజార్ల సీఈవోగా నందకిశోర్
ABN , First Publish Date - 2022-10-07T08:48:06+05:30 IST
రైతుబజార్ల సీఈవోగా నందకిశోర్
అమరావతి, అక్టోబరు 6(ఆంధజ్ర్యోతి): ఆంధ్రప్రదేశ్ టెక్నలాజికల్ సర్వీసెస్(ఏపీటీఎస్) ఎండీ ముల్లంగి నందకిశోర్‌ను ఏపీ రైతుబజార్ల సంస్థ సీఈవోగా ప్రభుత్వం నియమించింది. ఐఐఎస్ అధికారి అయిన నందకిశోర్ డిప్యూటేషన్‌ను 2024 సెప్టెంబరు 2 వరకు పొడిగిస్తూ సీఎస్ సమీర్‌శర్మ తాజాగా ఉత్తర్వులిచ్చి పై పోస్టుకు బదిలీ చేశారు. ఇప్పటి వరకు రైతుబజార్ల సీఈవోగా ఉన్న బీ శ్రీనివాసరావుకు ఇటీవల ఐఏఎస్ హోదా వచ్చింది. సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ అదనపు డైరెక్టర్‌గా నియమితులయిన ఆయన నిన్నటి వరకూ రైతుబజార్ల సీఈవోగా అదనపు బాధ్యతలను నిర్వహించారు.