ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు: నాగబాబు

ABN , First Publish Date - 2022-04-25T01:59:24+05:30 IST

వైసీపీ ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు తెలిపారు. రాజమండ్రిలో..

ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు: నాగబాబు

రాజమండ్రి: వైసీపీ ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని నాగబాబు తెలిపారు. రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనను ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన లీగల్ సెల్ సభ్యులు కలిశారు. ఆయా జిల్లాల్లో జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసులను నాగబాబుకు వివరించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జన సైనికులు, మహిళలపై పోలీసులను ఉపయోగించి వైసీపీ నాయకులు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సామాజిక బాధ్యతతో ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తుంటే వారిపై దాడులకు తెగబడుతున్నారని,  సంబంధం లేని కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసైనికులకు, వీర మహిళలకు న్యాయపరమైన అంశాల్లో జనసేన పార్టీ లీగల్ సెల్ సభ్యులు చేయూతనివ్వాలని కోరారు. పవన్ కల్యాణ్ భావజాలానికి అనుగుణంగా పని చేస్తున్న జన సైనికులను, వీర మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని నాగబాబు తెలిపారు. 

Read more