దసరా వేడుకల్లో ముస్లిం బాలిక నృత్యం

ABN , First Publish Date - 2022-10-05T08:48:11+05:30 IST

దసరా వేడుకల్లో ముస్లిం బాలిక నృత్యం

దసరా వేడుకల్లో ముస్లిం బాలిక నృత్యం

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అనంతపురం పాతూరు అమ్మవారిశాలలో (వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం) మంగళవారం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనల్లో ముస్లిం బాలిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నగరానికి చెందిన నాలుగో తరగతి విద్యార్థిని సనా.. కూచిపూడి నృత్య ప్రదర్శనతో అలరించింది. తన తల్లి సల్మా పాపను వెంటబెట్టుకు వచ్చి ప్రదర్శన ఇప్పించారు. కూచిపూడి సంప్రదాయ దుస్తుల్లో ఉన్న సనా.. తల్లి ఒడిలో కూర్చుని ఆసక్తిగా ఎదురు చూసింది. - అనంతపురం కల్చరల్‌

Read more