-
-
Home » Andhra Pradesh » mp sridhar ycp bjp tirumala andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
YCP MP Sridhar: మూడేళ్లుగా బీజేపీకీ మద్దతు ఇస్తున్నామన్న వైసీపీ ఎంపీ
ABN , First Publish Date - 2022-07-05T14:18:28+05:30 IST
బీజేపీకి వైసీపీ మద్దతు ఇస్తుండడంలో ఎటువంటి దాపరికం లేదని ఎంపీ శ్రీధర్ తెలిపారు.

తిరుమల: బీజేపీ(BJP)కి వైసీపీ(YCP) మద్దతు ఇస్తుండడంలో ఎటువంటి దాపరికం లేదని వైసీపీ ఏలూరు ఎంపీ శ్రీధర్(Sridhar) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... గత మూడేళ్లుగా బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు సందర్భాల్లో బీజేపీకీ ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించామని అన్నారు. బీజేపీకి మద్దతు ఇస్తుండడం వల్లే రాష్ట్రానికి కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా(special status) కోసం జగన్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారన్నారు. కచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తామని ఎంపీ శ్రీధర్ తెలిపారు. ఈ వైసీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీజేపీతో వైసీపీ అంటకాగిందని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో విమర్శిస్తున్న నేపథ్యంలో ఏలూరు ఎంపీ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.