అమ్మ రాజీనామా కరెక్ట్‌... అమ్మతో రాజీనామా కూడా కరెక్ట్: ఎంపీ Raghurama

ABN , First Publish Date - 2022-07-08T20:39:50+05:30 IST

విజయలక్ష్మి వీడ్కోలు సభలా వైసీపీ ప్లీనరీ సమావేశం ఉందని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.

అమ్మ రాజీనామా కరెక్ట్‌... అమ్మతో రాజీనామా కూడా కరెక్ట్: ఎంపీ Raghurama

న్యూఢిల్లీ/అమరావతి: విజయలక్ష్మి(Vijayalaxmi) వీడ్కోలు సభలా వైసీపీ ప్లీనరీ(YCP plenary) సమావేశం ఉందని ఎంపీ రఘురామకృష్ణం రాజు (Raghurama krishnam raju) అన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేయడంపై ఎంపీ రఘురామ స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అమ్మ రాజీనామానా.. అమ్మతో రాజీనామా అని అందరూ అడుగుతున్నారని  అన్నారు. విజయమ్మ రాజీనామా చేస్తోందని తాను ముందే చెప్పానన్నారు. అమ్మ రాజీనామా కరెక్ట్‌... అమ్మతో రాజీనామా కూడా కరెక్ట్ అని వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా గౌరవాధ్యక్షులకు పెద్ద పీట వేస్తారని, వైసీపీలో మాత్రం పెద్దకుర్చీలో సీఎం... చిన్న కుర్చీలో గౌరవాధ్యక్షులు ఉన్నారన్నారు. గౌరవ అధ్యక్షురాలికి పెద్ద సీటు వేస్తే గౌరవం దక్కేదని ఎంపీ తెలిపారు.


జగన్ జైల్లో ఉన్నప్పుడు దేహిదేహి అంటూ విజయలక్ష్మి తిరిగారని  గుర్తుచేశారు. కొడుకు బెయిల్ కోసం విజయలక్ష్మి సోనియా(Sonia) కాళ్లు పట్టుకున్నట్లు సమాచారం కూడా ఉందన్నారు. ప్లీనరీలో జగన్ చెప్పినవేవీ చేయలేదని విజయలక్ష్మి చెప్తానన్నారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడు కాన్సెప్ట్ కుదరదని... జగన్మోహన్ రెడ్డి అయిన ఇంకెవరైనా అని చెప్పుకొచ్చారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడు కాన్సెప్ట్ భారతదేశంలో ఎక్కడ ఉండదన్నారు. తాను కూడా పార్టీలో సభ్యుడిగా ఉన్నాట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడికి ఎన్నికలు జరగాలని, ఎన్నికలు లేకపోతే పదవిలో ఐదేళ్లు మాత్రమే ఉండాలని చెప్పారు. పార్టీ శాశ్వత అధ్యక్ష ఎంపికపై కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ‘‘భోజనాల ఖర్చు ఒకరిది, బియ్యం ఖర్చు ఒకరిది ప్లీనరీ వలన మా పార్టీకి లాభమే... నష్టం లేదు’’ అంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు యెద్దేవా చేశారు.

Read more