Raghuramakrishna Raju: ఉద్యోగులపై వైసీపీ ఉక్కుపాదం మోపుతోంది

ABN , First Publish Date - 2022-08-30T20:44:12+05:30 IST

ఉద్యోగులపై వైసీపీ ఉక్కుపాదం మోపుతోందని ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Raghuramakrishna Raju: ఉద్యోగులపై వైసీపీ ఉక్కుపాదం మోపుతోంది

న్యూఢిల్లీ: ఉద్యోగులపై వైసీపీ (YCP) ఉక్కుపాదం మోపుతోందని ఎంపీ రఘురామకృష్ణ రాజు (Raghuram krishna raju) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం సరికాదన్నారు. మనకు సాక్షి ఉంది కానీ.. మనసాక్షి లేదని వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల నిరసనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల జోలికి వెళ్లొద్దని.. పార్టీని ఉద్యోగులకు, ప్రజలకు దూరం చేయొద్దన్నారు. జగన్‌రెడ్డి (Jagan mohan reddy)కి రుణ రత్న అవార్డు ఇవ్వాలని యెద్దేవా చేశారు. కుప్పంలో అన్న క్యాంటీన్ల (Anna canteen)పై దాడి దుర్మార్గమని మండిపడ్డారు. మనం ఒకరికి పెట్టము.. ఇతరులను పెట్టనివ్వమని ఎంపీ రఘురామ మండిపడ్డారు. 

Read more