ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువు పెంచాలి

ABN , First Publish Date - 2022-11-03T05:32:32+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల నమోదుకు గడువు పెంచాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుండుపల్లి సతీశ్‌ కోరారు.

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువు పెంచాలి

సీఈవోకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సతీశ్‌ వినతి

అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల నమోదుకు గడువు పెంచాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుండుపల్లి సతీశ్‌ కోరారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాను కలిసి వినతిపత్రం అందజేసిన అనంతరం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటర్ల నమోదుపై అవగాహన ప్రచారాన్ని ముమ్మరం చేయాలన్నారు. సాంకేతిక సమస్యలు, సర్వర్‌ లోపాల కారణంగా చాలా వరకు ఓటర్ల నమోదు జరగలేదని తెలిపారు. ఓటరు నమోదుకు వ్యవధి తక్కువ ఉన్నందున ప్రతి చోట ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించాలని కోరారు.

Updated Date - 2022-11-03T05:32:33+05:30 IST