-
-
Home » Andhra Pradesh » MLA Payyavula Keshav-NGTS-AndhraPradesh
-
హక్కుల కోసం నిరసన తెలిపితే కక్ష సాధింపా?
ABN , First Publish Date - 2022-08-31T09:20:46+05:30 IST
సీపీఎస్ కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన తెలిపితే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం తగదని ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అనంతపురంలో ఆయన

ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
ఉరవకొండ, ఆగస్టు 30: సీపీఎస్ కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన తెలిపితే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం తగదని ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ సీపీఎస్‌పై ఉద్యోగులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకోవాలన్నారు. నిర్బంధాలు, అరెస్టులతో ఉద్యోగులను అణగదొక్కుతున్నారన్నారు. ప్రజా స్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు.