‘అధికారులు ఎవరో మాకు తెలియడం లేదు’

ABN , First Publish Date - 2022-07-07T02:51:19+05:30 IST

అధికారులు ఎవరో తమకు తెలియడం లేదని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వాళ్లమటుకు వాళ్లు వచ్చి వెళ్తున్నారని, ..

‘అధికారులు ఎవరో మాకు తెలియడం లేదు’

నెల్లూరు: అధికారులు ఎవరో తమకు తెలియడం లేదని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వాళ్లమటుకు వాళ్లు వచ్చి వెళ్తున్నారని, మమ్మల్ని కలిస్తే సమస్యలు చెబుతామన్నారు. ‘‘మాది మెట్టప్రాంతం.. అధికారులు కాస్తంత జాలి చూపండయ్యా.. ఉదయగిరి డిగ్రీ కాలేజీలో చాలా సమస్యలు ఉన్నాయి. కనీసం మరుగుదొడ్లు కూడా సరిగాలేవు, హైస్కూల్, ఇంటర్ కాలేజీ పాత భవనాల్లో నడుస్తున్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియదు. పిల్లలు రాక.. మా ఇంజనీరింగ్ కాలేజీ మూత వేసుకున్నాం’’ అని మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-07-07T02:51:19+05:30 IST