జగన్ బలహీన నేత
ABN , First Publish Date - 2022-04-15T09:01:14+05:30 IST
మంత్రివర్గ విస్తరణ తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బలహీనమైన నాయకుడని తేలిపోయిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
మంత్రివర్గంలో 8 జిల్లాలకు ప్రాతినిధ్యమే లేదు: గంటా
విశాఖపట్నం, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): మంత్రివర్గ విస్తరణ తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బలహీనమైన నాయకుడని తేలిపోయిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. గురువారం నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు బలమైన నాయకుడిగా జగన్‌కు రాష్ట్రంలో ఎదురులేదని చెప్పుకొచ్చారని, అయితే తాజా పరిణామాలతో అదంతా ఒట్టిదేనని స్పష్టమైందంటూ వివరించారు. మంత్రివర్గంలో 8 జిల్లాలకు ప్రాతినిధ్యమే కల్పించలేదన్నారు. విశాఖకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం బాధాకరమన్నారు. వైసీపీని నమ్మే స్థితిలో బీసీలు లేరన్నారు. ఎన్నికలకు ఐదారు నెలల ముందు పార్టీల మధ్య పొత్తులుంటాయి తప్ప రెండేళ్ల ముందుగా ఊహించలేమని అన్నారు. త్వరలో అఽధికార పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు ప్రారంభమవుతాయని, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వస్తారని జోస్యం చెప్పారు.