ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకల్లో రెచ్చిపోయి రికార్డింగ్‌ డ్యాన్స్‌

ABN , First Publish Date - 2022-08-04T07:56:10+05:30 IST

ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకల్లో రెచ్చిపోయి రికార్డింగ్‌ డ్యాన్స్‌

ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకల్లో రెచ్చిపోయి రికార్డింగ్‌ డ్యాన్స్‌

ఒంగోలు, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ బర్త్‌డే సందర్భంగా దర్శిలో మంగళవారం రాత్రి రికార్డింగ్‌ డ్యాన్స్‌లు వేశారు. స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో మంగళవారం రాత్రి వైసీపీ నాయకులు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమంలో యువతులు వేదికపై రెచ్చిపోయి చిందేశారు. ఈ డ్యాన్స్‌లను ఎమ్మెల్యే వేణుగోపాల్‌, ఇతర వైసీపీ నాయకులు స్టేజీ మీద కూర్చోని వీక్షించారు. ఎమ్మెల్యే బర్త్‌డే సందర్భంగా ఇలా పట్టణ నడిబొడ్డున రాకపోకలను నిలిపేసి రికార్డింగ్‌ డ్యాన్స్‌లు ఏర్పాటుచేయటంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.Read more