ఏపీ సీఐడీ పోలీసుల వికృత ప్రవర్తన!

ABN , First Publish Date - 2022-10-05T08:11:19+05:30 IST

ఏపీ సీఐడీ పోలీసుల వికృత ప్రవర్తన!

ఏపీ సీఐడీ పోలీసుల వికృత ప్రవర్తన!

తీవ్ర మనోవేదనకు గురైన చింతకాల విజయ్‌ పిల్లలు

బాలల హక్కుల కమిషన్‌కు టీడీపీ నేత వర్ల ఫిర్యాదు


అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): టీడీపీ నేత చింతకాయల విజయ్‌ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి, ఆయన పిల్లలను భయభ్రాంతులకు గురి చేసిన ఏపీ సీఐడీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. ఇద్దరు చిన్నారుల పట్ల నలుగురు సీఐడీ పోలీసులు వికృతంగా ప్రవర్తించారంటూ తెలంగాణ బాలల హక్కుల చైర్‌పర్సన్‌ జె.శ్రీనివాసరావుకు లేఖ రాశారు. ‘ఈనెల ఒకటో తేదీన విజయ్‌ ఇంట్లోకి సివిల్‌ డ్రస్‌లో ఉన్న నలుగురు వ్యక్తులు చొరబడ్డారు. విజయ్‌ డ్రైవర్‌ను కొట్టారు. ఇంట్లోని వస్తువుల్ని చెల్లాచెదురు చేశారు. విజయ్‌ ఐదేళ్ల కుమార్తెను ‘మీ నాన్న ఏడ’ని ప్రశ్నిస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. ఐదేళ్లు, రెండేళ్లు వయసున్న ఇద్దరు పిల్లల ఫొటోలను తీసుకెళ్లారు. పోలీసుల తీరుతో చిన్నారులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్‌ కుమార్తెల పట్ల అనుచితంగా ప్రవర్తించిన సీఐడీ పోలీసులపై తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు.


Read more