నాలుగు బిల్డింగులు కట్టి రాజధాని అన్నారు.. మంత్రి వెల్లంపల్లి విసుర్లు

ABN , First Publish Date - 2022-03-06T03:41:15+05:30 IST

చంద్రబాబు పాలనలో విజయవాడలో దేవాలయాలను కూల్చారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో ..

నాలుగు బిల్డింగులు కట్టి రాజధాని అన్నారు.. మంత్రి వెల్లంపల్లి విసుర్లు

గుంటూరు: చంద్రబాబు పాలనలో విజయవాడలో దేవాలయాలను కూల్చారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో కలిసి  సత్తెనపల్లిలో గడియార స్తంభం‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ, జనసేన కలసి దేవాలయాలను, గోశాలను కూల్చి దుర్మార్గపు పరిపాలన చేశారని చెప్పారు.  తెలుగుదేశం పార్టీ  మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తుందోన్నారు. అమరావతి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరిని భ్రమరావతిలో ఉంచారని,  నాలుగు బిల్డింగులు కట్టి రాజధాని అన్నారని మంత్రి వెల్లంపల్లి ఎద్దేవా చేశారు.  తాత్కాలిక బిల్డింగులు  కట్టి తాత్కాలిక ముఖ్యమంత్రిగా పని చేసి తాత్కాలికంగా వెళ్లి పోయిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. విజయవాడ దుర్గ గుడిని వైసీసీ ప్రభుత్వం రూ. 70 కోట్లతో అభివృద్ధి చేస్తోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. 


Read more