అంబేద్కర్ ఆలోచనలను జగ్జీవన్ రామ్‌ అమలు చేశారు: మంత్రి వెలంపల్లి

ABN , First Publish Date - 2022-04-05T17:28:51+05:30 IST

అంబేద్కర్ ఆలోచనలను తొలినాళ్లలో సక్రమంగా అమలు చేసింది జగ్జీవన్ రామ్‌ మాత్రమేనని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.

అంబేద్కర్ ఆలోచనలను జగ్జీవన్ రామ్‌ అమలు చేశారు: మంత్రి వెలంపల్లి

అమరావతి: అంబేద్కర్ ఆలోచనలను తొలినాళ్లలో సక్రమంగా అమలు చేసింది జగ్జీవన్ రామ్‌ మాత్రమేనని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు.114వ బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘ఉప ప్రధానిగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పనిచేశారు. ఎన్నో కష్టాలు పడి బాబు జగ్జీవన్ రామ్‌ పోరాటం చేశారు.బతుకు, చదువు కోసం ఆయన చిన్నతనం నుంచి పోరాటం చేశారు. ఎన్నికల్లో ఓటమి ఎరుగని నాయకుడు జగ్జీవన్ రామ్‌.అంబేద్కర్, జగ్జీవన్ రామ్‌ ఎన్నో పోరాటాలు చేశారు.కార్మిక, వ్యవసాయ శాఖల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.జగ్జీవన్ రామ్‌, బాబా సాహెబ్ అంబేద్కర్‌ల చరిత్ర పిల్లల పుస్తకాల్లో పాఠాలుగా చేర్చాలని ముఖ్యమంత్రిని కోరతాను’’ అని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. 

Updated Date - 2022-04-05T17:28:51+05:30 IST