లేదు లేదంటూనే.. అమాత్యుల సేవలో TTD..

ABN , First Publish Date - 2022-08-15T14:16:59+05:30 IST

వీకెండ్స్‌తో పాటు సెలవు దినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దంటూ ఊదరగొడుతున్న టీటీడీ (TTD) అధికారులు..

లేదు లేదంటూనే.. అమాత్యుల సేవలో TTD..

తిరుమల : వీకెండ్స్‌తో పాటు సెలవు దినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దంటూ ఊదరగొడుతున్న టీటీడీ (TTD) అధికారులు.. ఆచరణలో మాత్రం పెట్టడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దంటూనే అమాత్యుల సేవలో తరిస్తోంది. మంత్రి ఉషశ్రీ(Ushasri Charan) చరణ్ ఒత్తిడికి తలొగ్గి 50 బ్రేక్ దర్శనం టికెట్లతో పాటు.. 10 సుప్రభాతం టిక్కెట్లను జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. మంత్రి ఉషశ్రీ చరణ్ సైతం కనీసం భక్తుల కష్టాలను పట్టించుకోకుండా ఇష్టానురీతిన వ్యవహరించడం గమనార్హం. నిజానికి గత నాలుగు రోజులుగా సెలవు దినాలు కావడంతో తిరుమల క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసి పోతున్నాయి. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి భక్తులు వెలుపలికి రావడం గమనార్హం. అంతేకాకుండా ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా భక్తులు నిండిపోవడంతో లేపాక్షి సర్కిల్, షాపింగ్ కాంప్లెక్స్, పాత అన్నదానం మీదుగా శ్రీవారి సేవా సదన్ (Srivari Seva Sadan) వద్ద క్యూలైన్ ఉంది.  క్యూ‎లైన్‎లో భక్తులు 30 గంటలకు పైనే వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి స్థితిలో కూడా భక్తులకు దర్శనం కల్పించకుండా అమాత్యుల సేవలో టీటీడీ అధికారులు తరిస్తుండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Read more