ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కొట్టు సత్యనారాయణ

ABN , First Publish Date - 2022-07-12T17:20:10+05:30 IST

ఇంద్రకీలాద్రి అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మంగళవారం దర్శించుకున్నారు.

ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కొట్టు సత్యనారాయణ

విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మంగళవారం దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి లడ్డు ప్రసాదాన్నిఆలయ ఈవో భ్రమరాంబ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. శాకంబరీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరికీ  ఆలయ అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారని చెప్పారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయంలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

Updated Date - 2022-07-12T17:20:10+05:30 IST