డ్యూటీ చేయమంటే మీవాళ్లను పంపుకుంటారా?: మంత్రి కొట్టు ఫైర్

ABN , First Publish Date - 2022-09-30T20:12:22+05:30 IST

ఇంద్రకీలాద్రి (Indrakeeladri) పోలీసులపై డిప్యూటి సీఎం, దేవాదాయశాఖమంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana) ఆగ్రహం వ్యక్తం చేశారు

డ్యూటీ చేయమంటే మీవాళ్లను పంపుకుంటారా?: మంత్రి కొట్టు ఫైర్

Vijayawada : ఇంద్రకీలాద్రి (Indrakeeladri) పోలీసులపై డిప్యూటి సీఎం, దేవాదాయశాఖమంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana) ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో పోలీసులు తమ కుటుంబ సభ్యుల (Family members)ను దర్శనానికి తీసుకెళుతున్నారు. అదే సమయంలో మంత్రి కొట్టు సత్యనారాయణ (Minister Kottu Satyanarayana) క్యూలైన్స్‌ను పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులను తీసుకెళుతున్న పోలీసులను మంత్రి కొట్టు మందలించారు. చినరాజగోపురం వీఐపీ ఎంట్రీ పాయింట్ వద్ద పోలీసులపై ఫైర్ అయ్యారు. డిఎస్పీ ఎక్కడ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ చేయమంటే మీవాళ్లను పంపుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ చేయడం ఇష్టంలేకపోతే వెళ్లిపోవచ్చంటూ హెచ్చరించారు. సీపీకి కాల్ చేసి పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలా‌చేస్తే ఊరుకోబోనంటూ కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు.


Read more