ఏపీకి వెళ్లేందుకు అనుమతి ఇప్పించండి

ABN , First Publish Date - 2022-04-24T10:13:15+05:30 IST

ఉమ్మడి రాష్ట్రంలో ఎంపికైన తమను తిరిగి సొంత జిల్లాలకు వెళ్లేలా అనుమతించేందుకు..

ఏపీకి వెళ్లేందుకు అనుమతి ఇప్పించండి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఏపీ హోంగార్డుల వినతి


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్రంలో ఎంపికైన తమను తిరిగి సొంత జిల్లాలకు వెళ్లేలా అనుమతించేందుకు కృషి చేయాలని పలువురు ఏపీ హోంగార్డులు కేంద్ర పర్యాటక, సాంస్తృతికశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డిని అభ్యర్థించారు. దాదాపు వెయ్యిమంది ఇక్కడ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీకి తిరిగి వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్‌ఓసీ ఇచ్చిందని, ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వారు వివరించారు. ఈ మేరకు పలువురు హోంగార్డులు శనివారం, కిషన్‌రెడ్డిని కలుసుకుని వినతిపత్రం అందజేశారు.

Read more