విశాఖలో ఐ మెగా వీల్ ఏర్పాటు: మంత్రి అవంతి

ABN , First Publish Date - 2022-01-26T00:52:53+05:30 IST

విశాఖపట్నంలో లండన్ ఐ మెగా వీల్, క్రూయిస్ టూరిజం

విశాఖలో ఐ మెగా వీల్ ఏర్పాటు: మంత్రి అవంతి

విశాఖ: విశాఖపట్నంలో లండన్ ఐ మెగా వీల్, క్రూయిస్ టూరిజం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని వీఎంఆర్డీఏ, అజాద్ కా అమృతోత్సవంలో భాగంగా నేషనల్ టూరిజం డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాల అభివృద్ధితో పాటు టూరిజం శాఖ తరపున ఒక యాప్‌ని తీసుకు వస్తున్నామన్నారు. ఏజెన్సీ పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ను నిషేధించాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా 18 హోటల్స్ ఏర్పాటు చేసి, ఆపరేషన్ మేనేజ్మెంట్‌లో  శిక్షణ ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు హాజరయ్యారు. 

Updated Date - 2022-01-26T00:52:53+05:30 IST