చింతపల్లిలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
ABN , First Publish Date - 2022-12-09T03:09:04+05:30 IST
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏజెన్సీ గజగజ వణుకుతున్నది.
చింతపల్లి, డిసెంబరు 8: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏజెన్సీ గజగజ వణుకుతున్నది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభా వం వల్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. గురువారం చింతపల్లిలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఎం.సురేశ్‌కుమార్ తెలిపారు.