బెజవాడలో ‘కాపు’ నేతల సమావేశం
ABN , First Publish Date - 2022-12-16T01:52:17+05:30 IST
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, చీరాల టీడీపీ నాయకుడు యడం బాలాజీ బుధవారం విజయవాడలోని గంటా శ్రీనివాసరావు నివాసంలో సమావేశమయ్యారు.
విజయవాడ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, చీరాల టీడీపీ నాయకుడు యడం బాలాజీ బుధవారం విజయవాడలోని గంటా శ్రీనివాసరావు నివాసంలో సమావేశమయ్యారు. డిసెంబరు 26న వైజాగ్‌లో రంగా వర్ధంతికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని కాపునాడు సమావేశంగా కూడా భావిస్తున్నారు. ఈ కార్యక్రమాలపై గురువారం నాటి సమావేశంలో చర్చ జరిగినట్టు సమాచారం. అయితే బొండా ఉమ మాట్లాడుతూ...‘‘ఇది సాధారణ సమావేశం మాత్రమే. దీనికి ఎలాంటి ప్రాధాన్యం లేదు. 26న వైజాగ్‌లో కేవలం రంగా వర్ధంతిని పురస్కరించుకుని కార్యక్రమాలునిర్వహిస్తున్నామే తప్ప అది కాపునాడు సమావేశం కాదు’’ అని స్పష్టం చేశారు.