కార్మికులకు మేడే శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2022-05-02T08:21:16+05:30 IST
శ్రామిక కార్మిక సోదరులకు చంద్రబాబు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, మే 1 (ఆంధ్రజ్యోతి):శ్రామిక కార్మిక సోదరులకు చంద్రబాబు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లు. టీడీపీ హయాంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో లక్షల మంది ఉపాధి పొందారు. అప్పుడు పారిశ్రామిక రంగం కళకళలాడుతూ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపింది. ఇప్పుడు కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి కూడా విద్యుత్ హాలిడేలతో అల్లాడిపోతున్నాయి. కార్మిక లోకం ఉపాఽధికి గండి పడుతోంది. ఇప్పటికైనా కార్మిక లోకం ప్రభుత్వ తిరోగమన విధానాలపై మేడే స్ఫూర్తితో పోరాడాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.