sai priya: వివాహిత సాయిప్రియ అదృశ్యం కేసులో ఊహించని ట్విస్ట్.. ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో..
ABN , First Publish Date - 2022-07-28T03:35:42+05:30 IST
ఆర్కే బీచ్‌లో సోమవారం రాత్రి వివాహిత గల్లంతు వ్యవహారంలో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. తల్లిదండ్రులకు..

విశాఖ: ఆర్కే బీచ్‌లో సోమవారం రాత్రి వివాహిత గల్లంతు (sai priya missing) వ్యవహారంలో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. తల్లిదండ్రులకు సాయిప్రియ (sai priya) వాట్సాప్ మెసేజ్ చేయడంతో ఆమె అదృశ్యంపై కొనసాగిన సస్పెన్స్‌కు తెరపడింది. తాను క్షేమంగానే ఉన్నానని వెతకొద్దంటూ సాయిప్రియ (sai priya missing in rk beach) తన తల్లికి వాట్సాప్‌లో మెసేజ్ చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏంటంటే.. బెంగళూరులో తన ప్రియుడిని పెళ్లి చేసుకున్నట్లు సాయిప్రియ (sai priya vizag) ఆమె తల్లిదండ్రులకు వెల్లడించింది. తాళిబొట్టుతో ఉన్న పెళ్లిఫొటోలను సాయిప్రియ (sai priya missing girl) ఆమె తల్లిదండ్రులకు పంపింది. బెంగళూరు నుంచి మెసేజ్ వచ్చినట్లు విశాఖ పోలీసులు గుర్తించారు.
అసలేం జరిగిందంటే..
విశాఖ నగరంలోని ఎన్ఏడీ ప్రాంతంలో గల సంజీవ్‌నగర్‌కు చెందిన రామిరెడ్డి అప్పలరాజు కుమార్తె సాయిప్రియ (21)కు శ్రీకాకుళం జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన శిరుగుడి శ్రీనివాసరావుకు 2020 జూలై 25న పెళ్లి జరిగింది. శ్రీనివాసరావు హైదరాబాద్‌లోని ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్యతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఈ నెల 25న (సోమవారం) పెళ్లిరోజు కావడంతో భార్యాభర్తలిద్దరూ రెండు రోజులు ముందు సాయిప్రియ ఇంటికి వచ్చారు. సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు బీచ్‌కు వెళ్లారు. ఇద్దరం కలిసి నీళ్లలోకి దిగామని, తన సెల్‌కు ఏదో మెసేజ్ రావడంతో చూసేందుకు ఒడ్డుకు వచ్చానని...తిరిగి వెనక్కి చూసేసరికి సాయిప్రియ కనిపించలేదని (sai priya vizag missing), సముద్రంలో గల్లంతై వుంటుందని శ్రీనివాసరావు చెబుతున్నాడు. దీంతో పరిసర ప్రాంతాల్లో ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పానని, ఆయన సలహా మేరకు సమీపంలో వున్న పోలీసులకు సమాచారం ఇచ్చానన్నాడు. తనను పోలీసులు పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తీసుకువెళ్లి అక్కడ కమాండ్ కంట్రోల్‌రూమ్ నుంచి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారని, కొన్ని పనిచేయకపోగా, మరికొన్ని పనిచేస్తున్నాచీకటి కారణంగా ఏమీ కనిపించలేదని తెలిపాడు.
అయితే వివాహిత (sai priya news today) సముద్రంలో గల్లంతైనట్టు మంగళవారం మీడియాలో వార్తలు రావడంతో జిల్లా కలెక్టర్ స్పందించి నేవీ, కోస్ట్‌గార్డ్, మెరైన్ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టాలని ఆదేశించారు. దీంతో నేవీకి చెందిన హెలీకాప్టర్లు, కోస్ట్‌గార్డ్ షిప్‌లు తీరం వెంబడి గాలించాయి. మెరైన్ పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించారు. మంగళవారం రాత్రి తొమ్మిది గంటల వరకూ ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో పోలీసులు అసలేం జరిగిందనే దానిపై దృష్టిసారించారు. ఇప్పుడు ఆమె బెంగళూరులో ఉందని గుర్తించారు. శ్రీనివాసరావుకు, సాయిప్రియకు (sai priya case) పెళ్లై రెండేళ్లయినా ఇంకా సంతానం కలగలేదని, దీనిపై వారిద్దరి మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది.