ఫాసిజానికి పరాకాష్ఠ జగన్‌ పాలన

ABN , First Publish Date - 2022-08-31T09:21:18+05:30 IST

జగన్‌ పాలన ఫాసిజానికి పరాకాష్ఠగా మారిందని, సీపీఎస్‌ రద్దుకు చేస్తున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని మా వోయిస్టు పార్టీ

ఫాసిజానికి పరాకాష్ఠ జగన్‌ పాలన

మావోయిస్టు నేత గణేష్‌ ధ్వజం


పాడేరు, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): జగన్‌ పాలన ఫాసిజానికి పరాకాష్ఠగా మారిందని, సీపీఎస్‌ రద్దుకు  చేస్తున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని మా వోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యద ర్శి గణేశ్‌ ప్రకటించారు. ఆయన పేరిట మంగళవారం లేఖ విడుదలైంది. ‘సీపీఎస్‌ రద్దుపై జగన్‌ ఇచ్చిన హా మీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ ‘చలో విజయవాడ’కి పిలుపునివ్వడంతో వారిపై వారం ముందు నుంచే నిర్బంధం విధించారు. నోటీసులు ఇవ్వడం, సంఘ నేతల నిర్బంధం, అరెస్టులు చేపట్టారు. గత ఏడాది ప్రభుత్వం నిర్బంధాలు విధించినా.. ఉపాధ్యా యులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇప్పుడు వారి నిరసనకు మేం మద్దతుగా నిలుస్తాం’ అని  గణేశ్‌ తెలిపారు.

Read more