అమరావతిలో 9న శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ

ABN , First Publish Date - 2022-06-07T09:45:11+05:30 IST

రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ ఈ నెల 9న జరగనుంది.

అమరావతిలో 9న శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ

తుళ్లూరు, జూన్‌ 6: రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ ఈ నెల 9న జరగనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి సోమవారం పరిశీలించారు. అనంతరం సుబ్బారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. అమరావతిలో నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెల 8వ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, 9న ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు మిఽథునలగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి తదితరులు హాజరవుతారన్నారు. 

Read more