జగ్జీవన్ రామ్‌కు లోకేష్ ఘన నివాళి

ABN , First Publish Date - 2022-04-05T13:48:29+05:30 IST

సంస్కరణవాది, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘనంగా నివాళి అర్పించారు.

జగ్జీవన్ రామ్‌కు లోకేష్ ఘన నివాళి

అమరావతి: సంస్కరణవాది, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్  జయంతి సందర్భంగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘనంగా నివాళి అర్పించారు. పేదలు, శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తూనే సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ అని చెప్పారు. దళితుల హక్కుల అమల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు వారు విద్యావంతులుగా, ఆత్మాభిమానం కలిగిన వారిగా ఉండాలని జీవితాంతం పరితపించారన్నారు. బాబు జగ్జీవన్ రామ్ నిర్వహించిన ప్రతి పదవితో వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మార్గదర్శి  అని నారా లోకేష్  కొని యాడారు. 

Read more