నకిలీ ఉద్యోగులపై లోకాయుక్త ఆందోళన
ABN , First Publish Date - 2022-12-31T05:55:27+05:30 IST
నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందే వారి సం ఖ్య పెరిగిపోయిందని లోకాయుక్త ఆందోళన వ్యక్తం చేసి ంది.
కర్నూలు(లీగల్), డిసెంబరు 30: నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందే వారి సం ఖ్య పెరిగిపోయిందని లోకాయుక్త ఆందోళన వ్యక్తం చేసి ంది. నకిలీ టీటీసీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగం సంపాదించిన ఇద్దరు టీచర్లపై ఆగ్ర హం వ్యక్తం చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం డి.భీమవరం స్కూల్‌లో ఎస్‌జీటీలుగా పనిచేస్తున్న జి.జయశ్రీ, కె.సూర్యారావు నకిలీ టీటీసీ సర్టిఫికెట్ల తో ఉద్యోగాలు పొందారని అడ్డతీగల గ్రామానికి చెందిన డి.వీరబాబు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం విచారణలో వారు సమర్పించి న సర్టిఫికెట్లు నకీలీవని తేల డంతో ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించింది. దీని పై స్పందించిన లోకాయుక్త ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.