కాంగ్రెస్ కార్యాలయానికి తాళం
ABN , First Publish Date - 2022-12-31T05:54:28+05:30 IST
ఆస్తి పన్ను చెల్లించనందుకు విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు శుక్రవారం తాళం వేశా రు.
ఇంటి పన్ను 24 లక్షలు బకాయి.. కక్షపూరిత చర్యని నాయకుల ఆరోపణ
విశాఖపట్నం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఆస్తి పన్ను చెల్లించనందుకు విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు శుక్రవారం తాళం వేశా రు. సుమారు 37 ఏళ్ల నుంచి ఇంటి పన్ను చెల్లించాల్సి ఉందని, రూ.24 లక్షల మేర బకాయి ఉన్నట్టు ఆ పార్టీ నాయకులకు అధికారులు సమాచారం అందించారు. తమ పార్టీ కార్యాలయానికి తాళం వేయడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించేందుకు కొంత గడువు ఇవ్వాల్సిందిగా మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, బొత్స సత్యనారాయణను కలిసి విన్నవించామని ఈలోగా అధికారులు తాళాలు వేయడమేమిటని నగర పార్టీ అధ్యక్షుడు గోవింద్ అన్నారు.