-
-
Home » Andhra Pradesh » Let put the bill of 3 capitals again-NGTS-AndhraPradesh
-
3 రాజధానుల బిల్లు మళ్లీ పెడతాం
ABN , First Publish Date - 2022-09-10T09:07:46+05:30 IST
‘‘అమరావతి ఒకప్పుడు దేవతల రాజధాని అనేవారు. కానీ ఇప్పుడది రాక్షసుల రాజధాని. మూడు రాజధానుల ఏర్పాటుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.

- అమరావతి రాక్షసుల రాజధాని
- అది ‘పాదయాత్ర’ కాదు... ఉత్తరాంధ్రపై దండయాత్ర: అమర్‌నాథ్
విశాఖపట్నం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘‘అమరావతి ఒకప్పుడు దేవతల రాజధాని అనేవారు. కానీ ఇప్పుడది రాక్షసుల రాజధాని. మూడు రాజధానుల ఏర్పాటుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎవరికీ అభ్యంతరం లేని విధంగా కొత్త బిల్లును తయారుచేస్తాం. అసెంబ్లీలో మళ్లీ ప్రవేశపెట్టి తీరతాం. దానిని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు’’ అని అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. శుక్రవారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎప్పుడైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించవచ్చు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా సీఎం ముందుకెళ్తున్నారు. చంద్రబాబు దానిని అడ్డుకునేందుకు అమరావతి ప్రాంత ప్రజలను రెచ్చగొట్టారు. అమరావతి నుంచి అరసవిల్లి యాత్రకు ఉసిగొల్పారు. అది పాదయాత్ర కాదు... ఉత్తరాంధ్రపై దండయాత్ర’’ అని అన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా అమర్‌నాథ్ చెప్పారు.