ఆ కుటుంబానికి మరకలు అంటించలేవ్: సోమిరెడ్డి
ABN , First Publish Date - 2022-08-04T07:52:30+05:30 IST
ఆ కుటుంబానికి మరకలు అంటించలేవ్: సోమిరెడ్డి
అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ కుటుంబంపై బురద జల్లడం నీ తరం కాదు కదా.. నీ తాతల తరం కూడా కాదని తెలుసుకో వీసారెడ్డి అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ‘‘16 నెలలు జైల్లో చిప్పకూడు తినొచ్చిన నువ్వు మా నాయకుడి కుటుంబాన్ని క్రిమినల్ ఫ్యామిలీ అంటావా? నీలాంటి నీచ చరిత్ర ఎన్టీఆర్ కుటుంబానికి లేదని గుర్తుంచుకో.. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా ఎన్టీఆర్ కుటుంబానికి మరకలు అంటించలేవని తెలుసుకో..’’ అంటూ హెచ్చరించారు.