విజయసాయిరెడ్డికి బుద్ధి చెబుతాం: రవినాయుడు
ABN , First Publish Date - 2022-08-04T07:50:56+05:30 IST
విజయసాయిరెడ్డికి బుద్ధి చెబుతాం: రవినాయుడు
గూడూరు, ఆగస్టు 3: లోకేశ్‌పై విజయసాయిరెడ్డి దుష్ప్రచారాన్ని మానుకోకుంటే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు హెచ్చరించారు. ఉమామహేశ్వరి మరణాన్ని లోకేశ్‌కు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారానికి వ్యతిరేకంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణం గమళ్లపాళెంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బుధవారం తెలుగు యువత, తెలుగు మహిళ, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ ఆధ్వర్యంలో విజయసాయిరెడ్డి చిత్రపటానికి చెప్పులదండ వేసి నిరసన తెలిపారు. అనంతరం విజయసాయిరెడ్డి, దేవేందర్‌రెడ్డిపై కేసులు నమోదు చేయాలని ఒకటో పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.