Tirumala: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో చిరుత పిల్ల మృతి
ABN , First Publish Date - 2022-12-23T19:57:19+05:30 IST
తిరుపతి నుంచి తిరుమల (Tirumala) వెళ్లే రెండో ఘాట్‌లోని వినాయక స్వామి గుడి వద్ద దాదాపు ఐదు నెలల వయసున్న చిరుతపులి పిల్లను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందింది.
తిరుపతి: తిరుపతి నుంచి తిరుమల (Tirumala) వెళ్లే రెండో ఘాట్‌లోని వినాయక స్వామి గుడి వద్ద దాదాపు ఐదు నెలల వయసున్న చిరుతపులి పిల్లను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందింది. శుక్రవారం తెల్లవారు జామున నాలుగు నుంచి ఐదు గంటల మఽధ్య రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురై మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత పిల్ల కళేబరాన్ని ఎస్వీ జూపార్కుకు తరలించారు. పోస్టుమార్టం నిర్వహించాక ఖననం చేశారు.