స్టార్ట్‌పల్లో ఏపీకి చివరి స్థానం

ABN , First Publish Date - 2022-07-05T08:28:48+05:30 IST

స్టార్ట్‌పల్లో ఏపీకి చివరి స్థానం

స్టార్ట్‌పల్లో ఏపీకి చివరి స్థానం

బెస్ట్‌ పెర్ఫార్మర్‌గా గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాలు


న్యూఢిల్లీ, జూలై 4(ఆంధ్రజ్యోతి): స్టార్ట్‌పలలో ఆంధ్రప్రదేశ్‌ బాగా వెనుకబడింది. కేంద్రం ప్రకటించిన ర్యాంకుల్లో చివరి కేటగిరి అయిన ఎమర్జింగ్‌ స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌లో బిహార్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే ఉన్నాయి. స్టార్ట్‌పలను నెలకొల్పడానికి ఆయా రాష్ట్రాలు సృష్టిస్తున్న ఎకో సిస్టమ్‌లపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేసి నివేదిక రూపొందించి రాష్ట్రాలకు ర్యాంకులను ప్రకటించింది. దీనిని సోమవారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ విడుదల చేశారు. 

Read more