కర్నూలు: కొలిమిగుండ్ల మండలంలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-02-25T21:55:12+05:30 IST
జిల్లాలోని కొలిమిగుండ్ల మండంలో పెట్నికోటలో
కర్నూలు: జిల్లాలోని కొలిమిగుండ్ల మండంలో పెట్నికోటలో ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేదంటూ ఇళ్లను కూల్చేందుకు అధికారుల యత్నం చేశారు. దీనిని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా పోలీసులను మోహరించారు. అధికారుల ప్రయత్నానానికి నిరసనగా వాస్మొల్ తాగి ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించారు.