-
-
Home » Andhra Pradesh » kurnool andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
కర్నూలులో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి దీక్ష
ABN , First Publish Date - 2022-03-05T19:35:47+05:30 IST
జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ ధర్నా చౌక్ వద్ద మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రజా నిరసన దీక్ష చేశారు.

కర్నూలు: జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ ధర్నా చౌక్ వద్ద మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రజా నిరసన దీక్ష చేశారు. డోన్, ఆదోనిని జిల్లాలుగా చేయాలని, నందికొట్కూరును కర్నూలు జిల్లాలో చేర్చాలని డిమాండ్ చేశారు. పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలో కలపాలన్నారు. మూడు రాజధానుల తీర్పు మాదిరిగానే జిల్లాల విభజన కూడా జగన్‌కు షాక్ తగులుతుందని అన్నారు. సంక్షేమ పథకాలే జగన్‌ను పాతాళానికి తీసుకెళ్తాయని దుయ్యబట్టారు. వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయని, కేవలం గడ్డ మాత్రమే మిగిలిందని వ్యాఖ్యనించారు. అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం తగదని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.