krishnashtami celebrations: విజయవాడ ఇస్కాన్ మందిర్‌లో కృష్ణ జన్మాష్టమి వేడుకలు
ABN , First Publish Date - 2022-08-17T15:45:38+05:30 IST
నగరంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం - ఇస్కాన్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగనున్నాయి.

విజయవాడ: నగరంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం - ఇస్కాన్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు శ్రీ కృష్ణ జన్మాష్టమి (Krishna Janmashtami Celebrations) వేడుకలు జరుగనున్నాయి. విజయవాడ ఇస్కాన్ జగన్నాథ మందిరం (Iskon temple)లో రెండు రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 19, 20 తేదీల్లో ఉండవల్లిలోని ఇస్కాన్ శ్యామసుందర్ మందిరంలో జన్మాష్టమి కార్యక్రమాలు చేయనున్నారు. రెండు వేల కిలోల పుష్పాలతో మహా పుష్కాభిషేకం నిర్వహించనున్నారు. 18న ఉదయం మహా శంఖాభిషేకం, శ్రీకృష్ణుని వేషధారణ, ఉట్టి మహోత్సవాలు జరుగనున్నాయి. శ్రీకృష్ణుని లీలను వివరిస్తూ ప్రత్యేక లేజర్‌షో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.